ప్రకృతి విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన కేరళలోని వయనాడ్లో తెలంగాణ మంత్రి సీతక్క పర్యటించారు. బాధిత కుటుంబాల సహాయార్థం తాను సేకరించిన రూ.20 లక్షల చెక్ను స్థానికఎమ్మెల్యే సిద్ధికీకి అందించారు. వరద బాధితులకు దుస్తులు, నిత్యవసర వస్తువులు అందజేశారు. వందలాది మృతదేహాలను సామూహిక ఖననం చేసిన ముండక్కై శ్మశానవాటికలో.. మృతులకు సీతక్క శ్రద్ధాంజలి ఘటించారు. మృతుల కుటుంబాలను చూసి కంటతడి పెట్టారు.