Homeహైదరాబాద్latest NewsBRSను వీడేందుకు వాళ్లు రెడీగా ఉన్నారు: మంత్రి జూపల్లి

BRSను వీడేందుకు వాళ్లు రెడీగా ఉన్నారు: మంత్రి జూపల్లి

– అన్ని హామీలు అమలు చేసి తీరుతాం
– గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసింది
– మంత్రి జూపల్లి కృష్ణారావు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్​ పార్టీని వీడేందుకు ఎంతో మంది లీడర్లు రెడీగా ఉన్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. తాము గతంలో ఇచ్చిన అన్ని హామీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్ప చేసిందని ఆరోపించారు. శుక్రవారం మంత్రి జూపల్లి గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడారు.

ఇది కూడా చదవండి: ఆడవారికి ఆర్టీసీ బిగ్ షాక్.. ఇక ఫ్రీ బస్సు ప్రయాణం కష్టమేనా..

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకే ప్రముఖ పారిశ్రామిక ఆదానిని సీఎం రేవంత్​ రెడ్డి కలిశారని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్నో చీకటి జీవోలు తెచ్చిందని జూపల్లి అన్నారు. తెలంగాణ రాష్ట్రం బంగారు పళ్లెం ఏమీ కాదని.. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. రూ.7 లక్షల కోట్ల అప్పు చేశారు. రూ.40 వేల కోట్లు వడ్డీలకే పోతోంది.

ఇది కూడా చదవండి: జస్ట్ రూ.400లతో అయోధ్యకు వెళ్లోచ్చు.. ఎలా అంటే..

బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు పార్లమెంటులో బీఆర్ఎస్​ మద్దతు ఇచ్చిందని చెప్పారు. 2018 ఎన్నికలప్పుడు బీఆర్ఎస్​ ఎన్నో హామీలు ఇచ్చినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. గతంలో విపక్షాలు బీఆర్ఎస్​ను రెండేళ్ల తర్వాత విమర్శిస్తే.. పసికందును విమర్శిస్తున్నారా?అని వాపోయారు. మరి బీఆర్ఎస్​ నేతలు 2 నెలలు కూడా ఎందుకు ఆగలేకపోతున్నారని జూపల్లి ప్రశ్నించారు.

ది కూడా చదవండి: హైదరాబాద్ లో దారుణం.. లవ్ చేయాలని అమ్మాయిలపై కత్తితో దాడి.

Recent

- Advertisment -spot_img