Homeహైదరాబాద్latest Newsఆడవారికి షాక్.. ఉచిత TSRTC బస్సు ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్..

ఆడవారికి షాక్.. ఉచిత TSRTC బస్సు ప్రయాణంపై హైకోర్టులో పిటిషన్..

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించింది. దీంతో మహిళలు బస్సుల్లో భారీగా ప్రయాణిస్తున్నారు. అయితే ఈ పథకంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నాగోల్ కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ వేశాడు. బస్సులో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తే.. అది వివక్షతకు దారి తీస్తుందని పిటిషన్ లో పేర్కొన్నాడు.

ఇది కూడా చదవండి: ఆ పాటతోనే ప్రభుత్వం మారింది: కేటీఆర్

కేంద్ర చట్టాల ద్వారా ఏర్పడిన ఆర్టీసీలో ఫ్రీ స్కీం ఇవ్వడంపై స్టేట్ గవర్నమెంట్ కు అధికారం లేదని చెప్పాడు. ఈ పథకం వల్ల చాలా మందికి ఇబ్బందులు ఎదరువుతున్నాయని పేర్కొన్నాడు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 47ను సస్పెండ్ చేయాలని కోరారు.

ఇది కూడా చదవండి: పాపం.. సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ఫుల్ ట్రోల్స్

ప్రజల టాక్స్ రూపంలో కట్టిన డబ్బులు ఉచిత ప్రయాణానికి ఖర్చు పెట్టడం సరికాదన్నారు. పై విషయాలన్నింటిని పరగణించి ఉచిత ప్రయాణాన్ని వెంటనే నిలిపి వేయాలని కోరాడు.

ఇది కూడా చదవండి: రుణమాఫీపై తెలంగాణ గవర్నమెంట్ గుడ్ న్యూస్

Recent

- Advertisment -spot_img