ఇదే నిజం, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని బాపునగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన రాహనుమ సెంటర్ (నాగరిక వికాస్) కేంద్రాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటుగా ప్రజలకు ఉపయోగపడే ప్రతి సేవ ను ఈ సెంటర్ ద్వారా యువత తమ స్వశక్తి తో ఎదగడానికి దోహదపడుతుందని ఈ సెంటర్ లో టైలరింగ్, కంప్యూటర్ వంటి శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ జమతే-ఇస్లామి-హింద్ ఇక్బాల్ హుస్సేన్, తెలుగు రైటర్ అబ్దుల్ రషీద్, సిటీ ప్రెసిడెంట్ జామతే -ఇస్లామి – హింద్ గ్రేటర్ హైదరాబాద్ ముబాషీర్ అహ్మద్, నిర్వాహకులు ప్రెసిడెంట్ అల్ -ఖైర్ సొసైటీ, జామతే – ఇస్లామి – హింద్ లింగంపల్లి వకీల్ అహ్మద్, నజీర్ ఖాన్, ముంతాజ్ బేగం పాల్గొన్నారు.