Modi :భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత దేశంలో కులచిచ్చు, మతచిచ్చు పెట్టి ప్రధానమంత్రి మోడీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి ఆరోపించారు.. శుక్రవారం ఆయన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సిపిఐ మూడవ వార్షిక మహాసభలకు హాజరై మాట్లాడారు దేశంలో ప్రజలు కులమతాలకతీతంగా ప్రజాస్వామ్య బద్దంగా జీవిస్తుంటే తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయ దురుద్దేశంతో ప్రజల మధ్య మోడీ విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుతు న్నారని ఆరోపించారు..
బిజెపి దాని అనుబంధ ఆర్ఎస్ఎస్, వీహెచ్పి, ఏబీవీపీ, సంఘ్ పరివార్ ల కనుసన్నల్లో హిందూ ముస్లిం మైనారిటీ దళితులపై దాడులకు దిగుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని పేర్కొన్నారు.
బిజెపి పాలనతో మత పిచ్చి, ఉన్మాదం పెరిగిపోయిందని దానికి వ్యతిరేకంగా లౌకిక ప్రజాస్వామిక దేశంగా నిలుపుకునేందుకు ప్రజాస్వామ్య పార్టీలన్నీ ఏకం కావలసిన ఆవసరం ఉందన్నారు.
బిజెపి ప్రభుత్వ మతోన్మాదం నియంతృత్వ, ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకించకపోతే దేశం అంధకారంగా మిగిలిపోతుందని అన్నారు. మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి దాట వేశాడని అన్నారు.
ఒక ఉన్మాదిగా Modi మారి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నాడు అని విమర్శించారు. దేశంలో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి అక్కడ షిండేలను దింపి బిజెపి ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకువస్తున్నాడని విమర్శించారు.తెలంగాణ లో కూడా అదే కుట్ర చేస్తున్నారని అన్నారు.