మూసీ మురికికూపంగా మారడానికి ఎక్కువభాగం కాంగ్రెస్ ప్రభుత్వాలు కారణమైతే, కొద్దిభాగం తెలుగుదేశం ప్రభుత్వానిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బిఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఆనకట్టలతో మూసీ నదిని కాపాడాలన్నారు. మూసీ అపరిశుభ్రంగా మారినది బీఆర్‌ఎస్ హయాంలో కాదన్నారు. రాష్ట్రం అపరిశుభ్రంగా మారడానికి గత ప్రభుత్వాలే కారణమన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని చురక అంటించారు. మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్ల రూపాయలు పెట్టి దోపిడీ చేయాల్సిన అవసరం లేదని విమర్శించారు. మూసీ విషయంలో రేవంత్ రెడ్డి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారన్నారు. నేవీ రాడార్ సెంటర్‌తో మూసీని ఉరి వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.