ఇదే నిజం, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లాలో వాస్తు, జ్యోతిష్య పురోహిత రంగంలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి నందిపురస్కారాలు అందజేశారు. ఇందులో భాగంగా సోమవారం వరంగల్ లో, యువ చైతన్య వెల్ఫేర్ సొసైటీ ,తెలుగు వెలుగు సాహితీ వేదిక, విశ్వకర్మ గాయత్రి నాట్య కళావేదిక, విశ్వకర్మ సేవా ఫౌండేషన్, శాంతి కృష్ణ సేవా సమితి నిర్వహించిన వేడుకల్లో బెల్లంపల్లి పట్టణ హనుమాన్ బస్తికి చెందిన పురోహితుడు భూంపల్లి కార్తికాచార్యులకు నంది అవార్డు వరిచింది. సాహితీ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో సభ్యులు కార్తికా చార్యులకు నంది అవార్డును అందజేశారు.