Homeహైదరాబాద్latest Newsతెలంగాణ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్లు

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్లు

తెలంగాణలో రైల్వే లైన్ల అభివృద్ధికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కొత్త రైల్వే లైన్లు ఇప్పటికే అనేక మార్గాల్లో నిర్మించబడ్డాయి. హైదరాబాద్‌లో అతిపెద్ద రైల్వే టెర్మినల్‌ను చర్లపల్లిలో నిర్మిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో మరో కొత్త రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. దీనికి సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. హనుమకొండ, జనగామ జిల్లాల మధ్య ఈ రైలు మార్గం అందుబాటులోకి రానుంది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి రోడ్డు నుంచి ధర్మసాగర్ మీదుగా నష్కల్ వరకు ఈ గూడ్స్ బైపాస్ లైన్ అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మార్గం మొత్తం పొడవు 24.55 కి.మీ. ఈ మేరకు భూసేకరణకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో పెండ్యాల నుంచి 163వ నెంబరు జాతీయ రహదారి వెంబడి ఈ లైను ప్రతిపాదించగా.. ఆ తర్వాత బైపాస్ మార్గాన్ని మారుస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ధర్మసాగర్ మీదుగా బైపాస్ లైన్ నిర్మించేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. హనుమకొండ, జనగామ జిల్లాల్లోని హసన్‌పర్తి, చిల్పూర్‌, ధర్మసాగర్‌ రెవెన్యూ అధికారులకు అవసరమైన భూసేకరణ చేపట్టాలని నోటీసులిచ్చారు. ఈ లైనుతో పాటు నష్కల్ నుంచి మామునూరు మీదుగా గీసుకొండ మండలం చింతల్ రైల్వేస్టేషన్ వరకు మరో బైపాస్ మార్గాన్ని రైల్వే శాఖ ప్రతిపాదించింది.

Recent

- Advertisment -spot_img