Homeహైదరాబాద్latest News8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాయికల్ పట్టణానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు: బీఆర్ఎస్ నాయకులు

8 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రాయికల్ పట్టణానికి ఎలాంటి నిధులు కేటాయించలేదు: బీఆర్ఎస్ నాయకులు

ఇదేనిజం, రాయికల్: రాయికల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ నాయకులు అత్యవసర పాత్రికేయ సమవేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గత ఎనిమిది నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రాయికల్ పట్టణానికి ఎలాంటి నిధులు కేటాయించాలేరని, ప్రస్తుతం పురపాలక సంఘం సిబ్బంది కి నేలసారి జీతాలు చెల్లించే పరిస్థితి లేక పోవడం ప్రభుత్వ సమర్థత కు తార్కాణం నిలిచింది అని, సిలెండర్ సబ్సిడీ, కరెంట్ బిల్లు మాపి ప్రజలకు అందడం లేదని రాయికల్ ప్రజల పై ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లు కక్ష్య కట్టారని ఎప్పుడు జగిత్యాల అభివృద్ధి కోసం పోటీపడుతున్న జీవన్ రెడ్డి సంజాయ్ లు రాయికల్ పట్టణ మండల అభివృద్ధి గూర్చి మాట్లాడక పోవడం అన్నారు ఎప్పుడు జగిత్యాల సుకపల్లి డబుల్ బెడ్ రూమ్ ల అభివృద్ధి కోసం అనే ఎమ్మెల్యే సంజాయ్ కుమార్ రాయికల్ డబుల్ బెడ్ రూమ్ స్లాబ్ లు పోసి మరిచి పోయి పట్టించుకోక పోవడంతో గత పద మూడు సంవత్సరాలుగా అరవైమంది ఎంపికచేసిన లబ్దిదారులు నిరీక్షిస్తున్నారని తెలుసుకోలేక పోతున్నారని, జగిత్యాల అభివృద్ధి గూర్చి మాట్లాడే కాంగ్రెస్ ఇద్దరు పెద్దలు వచ్చే నియోజకవర్గ పునర్వివిధనలో జగిత్యాల నియోజకవర్గంలో రాయికల్ మండలం ఉండదు అని ముందస్తు గానే గ్రహించి రాయికల్ అభివృద్ధి నిధులు మంజూరు చెయ్యడం లేదా అని ప్రశ్నించారు.

గతంలో మూడునెలల్లో నిర్మాణం చేస్తా అని చెప్పిన పురపాలక సంఘ భవనం విధుల లేమి గుత్తేదారు జాప్యంతో నిర్మాణం ఆగిపోయి సత్తనడకన సాగుతుంది అని కాంగ్రెస్ కండువాలు కప్పడం పై ఉన్న దృష్టి అభివృద్ధి పై ఎమ్మెల్యేకు లేడపోవడం బాధాకరం అని అన్నారు.గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల యధా విధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు రేషన్ కార్డులు లేక అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే మంజూరు చేసి అర్హులైన కోట్లాది ప్రజలకు న్యాయం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం ప్రజలకు హామీ ఇచ్చిన పథకాలన్ని అమలు చెయ్యాలని పేర్కొన్నారు. ఇట్టి ప్రెస్ మీట్ లో ఆర్ ఎస్ కౌన్సిలర్ లు మ్యాకల కాంత రావు, తురగ శ్రీధర్ రెడ్డి,మహేష్ గౌడ్, మారంపల్లి సాయి, నాయకులు ఎలిగేటి అనిల్ కుమార్, శ్రీరాముల సత్యనారాయణ పెండేల గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img