Homeహైదరాబాద్latest Newsసీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ: MLC Kavitha

సీబీఐ కస్టడీ కాదు.. బీజేపీ కస్టడీ: MLC Kavitha

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. కవిత సీబీఐ కస్టడీ నేటితో ముగియడంతో సీబీఐ అధికారులు ఆమెను కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో ఈనెల 23 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. అనంతరం కవితను తీహార్ జైలుకు తరలించారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను రెండురోజులపాటు సీబీఐ అధికారులు విచారించారు.

లిక్కర్ స్కామ్‌లో తనను సీబీఐ కస్టడీలోకి తీసుకోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇది సీబీఐ కస్టడీ కాదు.. ఇది బీజేపీ కస్టడీ. బయట బీజేపీ వాళ్లు మాట్లాడేది లోపల సీబీఐ వాళ్ళు అడుగుతున్నారు. అడిగిందే రెండేళ్లుగా అడుగుతున్నారు’’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img