ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర అవసరాల కోసం ప్రత్యేకంగా రామగుండంలో నిర్మించిన ఎన్‌టీసీసీ విద్యుత్ ప్లాంట్ తొలిదశ పూర్తిగా సిద్ధమైంది. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 1,600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ ప్లాంట్ నిర్మించాల్సి ఉండగా.. తొలి దశలో 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన యూనిట్ అందుబాటులోకి వచ్చింది. అక్టోబరు 3న నిజామాబాద్ పర్యటనలో ప్రధాని మోడీ వర్చువల్‌గా ఈ ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్నారు.