ఆధార్ కార్డుతో పాటుగానే పాన్ కార్డు కూడా ఎంతో ముఖ్యమైన డాక్యుమెంట్ అని చెప్పొచ్చు. అయితే దీనికి సంభందించి కొత్త మార్పులు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం పాన్ 2.0 ని తీసుకొచ్చింది. దీన్నకారణంగా చూపిస్తూ.. సైబర్ నేరగాళ్లు ఫోన్లు చేస్తున్నారు. కొత్తపాన్ కోసమని చెబుతూ వ్యక్తిగత సమాచారాన్ని, బ్యాంకుఖాతా వివరాలు అడుగుతున్నారు. ఈనేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఎవరైనా మోసపోయామని గుర్తిస్తే, వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి.