Homeహైదరాబాద్latest Newsపరువు తీసుకున్న పట్నం పోలీస్.. దేశంలోనే టాప్ పోలీస్ గా పేరు..కానీ ఈ పక్షపాతం ఏంటి..?

పరువు తీసుకున్న పట్నం పోలీస్.. దేశంలోనే టాప్ పోలీస్ గా పేరు..కానీ ఈ పక్షపాతం ఏంటి..?

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: దేశంలోనే తెలంగాణ పోలీస్ టాప్ అన్నది ముమ్మాటికీ నిజం. శాంతి భద్రతలు కాపాడడంలో నిక్కచ్చిగా ఉంటారనేపేరుంది. నక్సలిజంతో వారు చేసిన పోరాటాన్ని దేశంలోని మిగితా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ బలహీనతలు తెలంగాణ పోలీస్ లకు ఉండవనే పేరుంది. కానీ మొన్న (గత గురువారం) హైదరాబాద్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద ఫిరాయింపు ఎమ్మెల్యే గాంధీ జరిపిన దాడి ఘటనతో తెలంగాణ పోలీసుల ఇజ్జత్ మొత్తం పోయింది. తెలంగాణ పోలీస్ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఇటువంటి ఘటన జరగలేదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో సైబరాబాద్ పోలీస్ వ్యవహారించిన తీరు మొత్తం హైదరాబాద్ పోలీస్ ఇమేజ్ ని.. ఆ మాటకొస్తే తెలంగాణ రాష్ట్రానికి చెందిన 50 వేల మంది పోలీసుల ఇమేజ్ ని తగ్గించిందని చెప్పకు తప్పదు. రాజకీయం గా ఇంత దిగజారి అధికార పార్టీకి వత్తాసు పలకడం గతంలో ఈ రాష్ట్రము లో మునుపెన్నడూ లేదు.

Recent

- Advertisment -spot_img