కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు హీరో అల్లు అర్జున్‌కి పోలీసులు షరతులతో అనుమతి ఇచ్చారు. అల్లు అర్జున్ వచ్చే విషయం కూడా రహస్యంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ముందస్తు సమాచారం ఇస్తే తగిన విధంగా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. సమాచారం ఇవ్వకుండా వస్తే పూర్తి బాధ్యత మీదే అంటూ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. కిమ్స్ ఆస్పత్రికి ఎప్పుడు రావాలనుకున్నా సమాచారం ఇవ్వాలని నోటీసులు జారీ చేసారు.