HomeతెలంగాణPolitical heat in Telangana: పొలిటికల్​ హీట్​

Political heat in Telangana: పొలిటికల్​ హీట్​

– అన్ని పార్టీల్లోనూ ఎలక్షన్​ మూడ్​
– నోటిఫికేషన్​కు ముందే వేడెక్కిన రాజకీయం
– సెప్టెంబర్​ 17 కేంద్రంగా రాజకీయాలు
– కాంగ్రెస్​ బహిరంగసభ, బీజేపీ విమోచన దినోత్సవం
– పాలమూరు ఎత్తిపోతల వెట్​రన్ ను ప్రారంభించనున్న కేసీఆర్​
– హైదరాబాద్ లో పోటా పోటీ ఫ్లెక్సీలు

Political heat in Telangana: ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకున్నది. అన్ని పార్టీలూ ఎన్నికల మూడ్​లోకి వెళ్లిపోయాయి. సీడబ్ల్యూసీ మీటింగ్స్ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావానికి తెరలేపింది. ఇక బీజేపీ సైతం విమోచన దినోత్సవంలో పాల్గొనబోతున్నది. బీఆర్ఎస్​ సైతం తన కార్యాచరణను సిద్ధం చేసుకున్నది. నాగర్​కర్నూల్​ జిల్లా నార్లాపూర్​లో సమీపంలో నిర్మించిన పంప్​ హౌస్​, జలాశయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించబోతున్నారు. అనంతరం భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పాల్గొనబోతున్నారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు వరప్రదాయిని లాంటి ఈ ప్రాజెక్టుతో వలస జిల్లా పాలమూరు సస్యశ్యామలం కానున్నది బీఆర్ఎస్​ నేతల ప్రచారం చేస్తున్నారు.

​ విమోచన దినోత్సవంపై బీజేపీ ఫోకస్​
తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా పుంజుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో బీజేపీ గ్రాఫ్​ డౌన్​ అయ్యింది. దీంతో ఎలాగైనా పుంజుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా సెప్టెంబర్​ 17న విమోచనం దినోత్సవం నిర్వహించి ప్రజల్లో ఒకరకమైన సెంటిమెంట్​ రగిలించాలని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్​ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు. దీంతో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రంలో బలపడాలని బీజేపీ భావిస్తోంది.

బీఆర్ఎస్​ దూకుడు
ఇక బీఆర్ఎస్​ సైతం ఎన్నికల సమరంలో దూసుకుపోతున్నది. అందరికంటే ముందే సీఎం కేసీఆర్​ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. మరోవైపు నిత్యం అభివృద్ధి కార్యక్రమాల్లో బీఆర్ఎస్ వేగం పెంచింది. ఇక త్వరలో నాగర్ కర్నూల్​ జిల్లా లో పాలమూరు ఎత్తిపోతల పథకం వెట్​ రన్​ ను ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించబోతున్నారు. అక్కడే బీఆర్ఎస్​ బహిరంగసభ కూడా నిర్వహించబోతున్నది. ఇందుకోసం బీఆర్ఎస్​ నేతలు జనసమీకరణ చేస్తున్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్స్​ ఉండటంతో జాతీయ మీడియా ఫోకస్​ మొత్తం ఆ సమావేశాల మీదే ఉంటుంది. దీంతో బీజేపీ, బీఆర్ఎస్​ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Recent

- Advertisment -spot_img