తెలుగు, హిందీలో భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది పూజాహెగ్డే.
ఈ భామ మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో 3 లుక్స్ తో ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చేయడం చాలా ఫన్‌గా ఉంది.
ఈ స్టిల్స్ ను మీతో పంచుకోవడం చాలా ఎక్జయిటింగ్ గా ఉంది. ఈ స్టిల్స్ లో ఏది మీ ఫేవరేట్…? అని క్యాప్షన్ ఇచ్చింది.
ఓ ఫొటోలో సింపుల్ బ్లాక్ క్రాప్ టాప్, స్ట్రిప్పుడ్ ప్యాంట్స్ తో..రెండో స్టిల్‌లో షిమ్మరీ ఔట్‌ఫిట్ అండ్ గ్లాసీ మేకప్ లుక్‌తో, చివరగా సిల్వర్ మినీ హాట్ డ్రెస్‌లో ట్రాన్స్ ఫార్మేషన్ అవుతున్న వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
పూజా హెగ్డే-ప్రభాస్‌తో కలిసి పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న రాధేశ్యామ్‌లో నటిస్తోంది. మరోవైపు అఖిల్ అక్కినేనితో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చేస్తోంది.