Homeజాతీయంసోమవారం హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము

సోమవారం హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. శీతాకాలం విడిది కోసం ఆమె ఇక్కడికి రానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. హకీంపేట్ విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకూ కాన్వాయ్‌తో రిహార్సల్ నిర్వహించారు. సోమవారం నుంచి ఈ నెల 23 వరుకూ హైదరాబాద్ నుంచి అధికారిక కార్యక్రమాలు కొనసాగించాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తెలిపారు. ఐదు రోజల పాటు రాష్ట్రపతి హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఈ నెల 23న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు.

Recent

- Advertisment -spot_img