Homeహైదరాబాద్latest Newsబీజేపీపై విరుచుకుపడ్డ ప్రియాంకా గాంధీ

బీజేపీపై విరుచుకుపడ్డ ప్రియాంకా గాంధీ

బీజేపీ పాలిత రాష్ట్రాలు కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నాయని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకా గాంధీ అన్నారు. పదేళ్లలో గొప్పోళ్లు, ధనవంతుల కోసమే బీజేపీ పని చేసిందని ఆరోపించారు. కార్మికులు, కర్షకుల కోసం ఏమీ చేయలేదన్నారు. తాండూరులో జరిగిన కాంగ్రెస్ మీటింగ్‌లో ఆమె మాట్లాడారు.

“మనం కట్టే ట్యాక్సులు పెరుగుతాయి. కానీ ఉన్నోళ్లవి పెరగవు. పేదరైతులు రూ. 50 వేలు, రూ. లక్ష రుణాలు కట్టలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకోవట్లేదు. వర్షాలు పడి, పంటలు నష్టపోతోన్న వేళ అధిక వడ్డీకి రుణాలు తెచ్చుకుంటున్నారు. చిరు వ్యాపారుల సమస్యలు ఏటా పెరుగుతున్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ రావడం వల్ల సామాన్యుడి నడ్డి విరిగింది. పెట్టుబడులు రావడం లేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదు. సరిగా నిధులు మంజూరు కావడం లేదు. ఐఐఎం, నవోదయ వంటి విద్యాసంస్థలు కావాలని అడిగితే ఇవ్వలేదు. కాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ట్రైబల్ యూనివర్సిటీ పనుల పురోగతి లేదు. ఈరోజు దేశంలో 70 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. అయితే కేంద్రంలో 30 లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విద్యుత్ సంస్థలన్నింటినీ పెద్దోళ్లకే కట్టబెడుతున్నారు. దేశంలో రూ. 16 లక్షల కోట్లు మాఫీ చేశారు. వాళ్ల పన్నులను మీరు చెల్లిస్తున్నారు. దేశ సంపద కేవలం ఇద్దరు, ముగ్గురు చేతుల్లోకి వెళుతోంది. దేశంలోని పెద్దపెద్ద మీడియా సంస్థలు వాళ్ల చెప్పుచేతల్లోకి వెళ్లిపోయాయి. ప్రజల కోసం పనిచేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. బీజేపీ మాత్రం అధికారం మాత్రమే ధ్యేయంగా పనిచేస్తోంది. ధర్మం పేరిట.. సోదరుల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. మనుషుల్లో భేదభావాలు సృష్టించి లబ్ధి పొందాలనుకుంటున్నారు. ప్రజల్ని విడగొట్టి భారత రాజ్యాంగాన్ని రద్దు చేయడమనేది ఎంతవరకు సమంజసమో అర్థం చేసుకోవాలి”.

– ప్రియాంకా గాంధీ, AICC ప్రధాన కార్యదర్శి

Recent

- Advertisment -spot_img