HomeసినిమాPushpa Item Song : ఊ అంటారా... దేవీ శ్రీ ప్ర‌సాద్ కాపీ కొట్టారా

Pushpa Item Song : ఊ అంటారా… దేవీ శ్రీ ప్ర‌సాద్ కాపీ కొట్టారా

Pushpa Item Song : ఊ అంటారా… దేవీ శ్రీ ప్ర‌సాద్ కాపీ కొట్టారా

Pushpa Item Song – స్పెషల్ సాంగ్స్ చేయడంలో దేవి శ్రీ ప్రసాద్ స్టయిల్ సపరేట్.

ఆయన కంపోజ్ చేసిన ఎన్నో ట్యూన్స్ ట్రెండ్ క్రియేట్ చేశాయి. అటువంటి దేవి శ్రీ ప్రసాద్…

ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ విషయంలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.

ఆయన పాట ఎక్కడో విన్నట్టుందని, ఓ తమిళ సినిమాలో పాటను కాపీ చేశాడని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ద రైజ్’కు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఆల్రెడీ రిలీజ్ అయిన సాంగ్స్‌లో ‘రంగస్థలం’ ఫ్లేవర్ ఉందని కొంతమంది కామెంట్ చేశారు.

అది పక్కన పెడితే… అల్లు అర్జున్ అభిమానులకు, ప్రేక్షకులకు పాటలు నచ్చాయి.

లేటెస్ట్‌గా ‘ఊ అంటావా? ఊ ఊ అంటావా?’ సాంగ్ రిలీజ్ చేశారు. సమంత స్టెప్పులు వేసిన ఈ స్పెషల్ సాంగ్ కాపీ అనేది నెటిజన్స్ టాక్.

తమిళ హీరో సూర్య నటించిన ‘వీడోక్కడే’ సినిమా ఉంది కదా! అందులో ‘హానీ హానీ…’ అని ఓ స్పెషల్ సాంగ్ ఉంది.

దానిని దేవి శ్రీ ప్రసాద్ కాపీ చేశాడనేది నెటిజన్స్ కామెంట్.

ఆ పాట, ఈ పాట సేమ్ ఉన్నాయని అంటున్నారు. ఈ కాపీ కామెంట్స్ మీద దేవి శ్రీ ప్రసాద్, ‘పుష్ప’ టీమ్ ఎలా స్పందిస్తాయో చూడాలి.

ఇవి కూడా చ‌ద‌వండి

అభిమానుల ప్రేమకు స‌మంత సంబ‌రం

Samantha Latest Stunning Photos

స్టార్ హీరోయిన్లు ఏం చదువుకున్నారో తెలుసా..

Recent

- Advertisment -spot_img