ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ డిసెంబర్ 05న విడుదలై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ‘పుష్ప 2’ సినిమా విడుదలైన అన్ని చోట్ల రికార్డును బద్దలు కొడుతుంది. మొన్న బాలీవుడ్ బాదుషా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ మూవీ రికార్డును పుష్ప రాజ్ గాలంతు చేసాడు. తాజాగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కలెక్షన్ల రికార్డును కూడా ‘పుష్ప 2’ సినిమా బ్రేక్ చేసింది. దీంతో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ రూ.1300 కోట్ల కలెక్షన్ల రికార్డును ‘పుష్ప 2’ బద్దలు కొట్టి మూడో స్థానంలో నిలిచింది. అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమా రూ.2,122.3 కోట్లు వసూలు చేసి భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా అగ్రస్థానంలో నిలిచింది. రాజమౌళి ‘బాహుబలి 2’ రూ.1,788.06 కోట్లు వసూలు చేసి రెండో స్థానంలో నిలిచింది. 1,400 కోట్లకు పైగా కలెక్షన్లతో ‘పుష్ప 2’ మూడో స్థానంలో ఉంది. దీంతో ‘పుష్ప 2’ మూవీ రికార్డులు వేట కొనసాగుతోంది.