Rain Alert : తెలంగాణలో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, HYD, యాదాద్రి, రంగారెడ్డి, MBNR, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ఏలూరు, NTR, గుంటూరు, ప్రకాశం, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది.