బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆట ముగిసింది. తొలి సెషన్ మధ్యలో వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. రెండో, మూడో సెషన్లలో ఒక్క బంతి కూడా పడలేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. మెక్‌స్వీనీ (4), ఖవాజా (19) క్రీజులో ఉన్నారు.