మహేష్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ”SSMB29” అనే వర్కింగ్ టైటిల్‌ని పెట్టారు. ఈ సినిమాలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన అధిరిపోయే అప్డేట్ ఒక్కటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2025 లో రెగ్యులర్ షూటింగ్ మొదలపెట్టనున్నారు. అయితే దర్శకధీరుడు రాజమౌళి దక్షిణాఫ్రికాలో షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఈ సినిమాలో మొదటి దశగా ఓ పాటను ప్రదర్శించేందుకు 15 రోజుల పాటు సౌత్ ఆఫ్రికాలో షూట్ చేయాలని రాజమౌళి నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇది కూడా గ్రాండ్ ట్రైబల్ సాంగ్ గా రూపొందుతుందని అని తెలుస్తుంది.