అయ్యప్ప దీక్షలో మెగా స్టార్ హీరో రామ్‌చరణ్ సోమవారం కడపకు వెళ్లారు. అయ్యప్ప దీక్షలో మెగా హీరో రామ్‌చరణ్ పెద్ద కడప దర్గాను దర్శించుకున్నారు. ఈ విషయంపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు హీరో రామ్‌చరణ్ దర్గాను సందర్శించడంపై పలు హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో చర్చ హాట్ టాపిక్ గా మారింది. దర్గా అంటే సమాధి అని, పవిత్ర అయ్యప్ప మాల ధరించి దర్గాకు ఎందుకు వెళ్లాలని, మాల తీసి దర్గాను దర్శించుకోవాలని పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శబరిమల అయ్యప్ప సన్నిధిలో వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడి సమాధి కూడా ఉంది, అయ్యప్ప భక్తులు విధిగా ఆ దర్గాను సందర్శిస్తుంటారు. అక్కడ లేని తప్పు.. రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించడం తప్పేమిటని కొంతమంది రామ్ చరణ్ దర్గాను సందర్శించడాన్ని సమర్థిస్తున్నారు. అయితే వావర్ స్వామి అంటే కట్టుకథ అని, హిందూ భక్తులను తప్పుదోవ పట్టించేందుకు వావర్ స్వామి అనే ముస్లిం భక్తుడిని సృష్టించారని కొందరు నెటిజన్లు చర్చించుకుంటున్నారు.