Homeహైదరాబాద్latest Newsకులమతాలకు అతీతంగా రంగాపూర్​ జాతర

కులమతాలకు అతీతంగా రంగాపూర్​ జాతర

– అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

ఇదేనిజం, అచ్చంపేట: కులమతాలకు అతీతంగా రంగాపూర్​ జాతర నిర్వహించినట్టు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. రంగాపూర్​ జాతర అట్టహాసంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని అమ్రాబాద్​, మన్ననూర్​, అచ్చంపేట, బల్మూర్, ఉప్పునుంతల, బొమ్మనపల్లి తదితర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఈ జాతరకు హాజరయ్యారు.

ALSO READ: పాపం.. సీఎం రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ట్రోల్స్..

బుధవారం రాత్రి గంధోత్సవం నిర్వహించారు. గురువారం తెల్లవారుజాము వరకు గంధం నిరంజన్​ షావలి దర్గాను చేరుకున్నది. గంధోత్సవంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా జాతర జరిగిందని చెప్పారు. హిందూ ముస్లింలు నిరంజన్ షావలి దర్గాలో తమ మొక్కులు తీర్చుకున్నారన్నారు.

ALSO READ: ఆడవారికి తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img