Homeఫ్లాష్ ఫ్లాష్అనుపమా బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక డేటింగ్!

అనుపమా బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక డేటింగ్!

హైదరాబాద్: సౌత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న కన్నడ బ్యూటీ రష్మిక మందన రిలేషన్‌షిప్లో ఉన్నారట.

కు ప్రస్తుతం ఉంది.

రష్మిక మందన బయోగ్రఫీలో ఈ విషయాన్ని ప్రముఖ ఫిలింస్ డాటాబేస్ సంస్థ ఐఎండీబీ స్పష్టం చేశారు.

మలయాళ దర్శకుడు, నిర్మాత చిరంజీవ్ మక్వానాతో రష్మిక రిలేషన్‌షిప్‌లో ఉన్నారట.

ఐఎండీబీలో నిజానికి అనుమపమా పరమేశ్వరన్ ప్రియుడు చిరంజీవ్ మక్వానా అని ప్రచారంలో ఉంది.

అందుకనే, అనుపమా పరమేశ్వరన్ బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక మందన రిలేషన్‌షిప్‌లో ఉన్నారని ఐఎండీబీలో అప్‌డేట్ చేశారు.

మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే రష్మికనో లేదంటే చిరంజీవ్ మక్వానానో స్పందించే వరకు ఆగాల్సిందే.

రక్షిత్ శెట్టితో తొలి ప్రేమ

కన్నడ ఇండస్ట్రీ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన రష్మిక మందన.. ‘‘కిర్క్ పార్టీ’’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.

ఆ చిత్ర హీరో, దర్శకుడు రక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమలో పడ్డారు. ఆయనతో నిశ్చితార్థం కూడా జరిగింది.

ఆ తరవాత వ్యక్తిగత కారణాలతో రక్షిత్ శెట్టితో పెళ్లిని రద్దు చేసుకున్నారు రష్మిక.

టాలీవుడ్‌లో రష్మిక బాగా రాణిస్తుండటంతో ఆ జర్నీని కొనసాగించాలనే ఉద్దేశంతోనే రక్షిత్ శెట్టి నుంచి రష్మిక విడిపోయారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి.

విజయ్ దేవరకొండతోనూ రిలేషన్‌షిప్‌ ప్రచారం

విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమాలో నటించిన రష్మిక మందన ఆయనతో రిలేషన్‌షిప్‌లో ఉందనే ప్రచారం జరిగింది.

ఈ వదంతులను అటు రష్మిక, ఇటు విజయ్ దేవరకొండ ఖండించారు.

అయితే, ఇప్పుడు అనుపమా పరమేశ్వర్ బాయ్‌ఫ్రెండ్‌తో రష్మిక మందన డేటింగ్ చేస్తున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది.

సోషల్ మీడియాలో దీని గురించి చర్చ జరుగుతోంది. ఇందులో నిజమెంతో వారు స్పందిస్తే నే తెలుస్తుంది.

 

Recent

- Advertisment -spot_img