Homeలైఫ్‌స్టైల్‌#Life span : సుదీర్ఘ కాలం జీవించడానికి కారణం

#Life span : సుదీర్ఘ కాలం జీవించడానికి కారణం

కొందరు శతమానం జీవించడానికి కారణం? మంచి ఆహారపు అలవాట్లు, సకాలంలో వైద్యం, మానసిక ప్రశాంతత లాంటి కారణాలు వినిపిస్తాయి.

వీటితోపాటు మరో ముఖ్యకారణం ‘జన్యువులు’. కొందరి జన్యువులు దీర్ఘాయువుకు అనువుగా ఉండటం వల్లే సునాయసంగా సెంచరీ కొడుతున్నారు.

ఇది ఎంతవరకు నిజం? ‘సుదీర్ఘమైన ఆయుర్దాయానికి జన్యువులు ఎలా తోడ్పడతాయి?’ అనే సందేహం ఇటలీలోని కొందరు పరిశోధకులకు వచ్చింది.

ఈ రహస్యాన్ని శోధించేందుకు వాళ్లు 105 సంవత్సరాలకు పైబడిన వృద్ధులనుంచి రక్త నమూనాలు సేకరించారు.

వాటిని విశ్లేషించి జన్యుపటం తయారుచేశారు. అదే సమయంలో 60 ఏండ్ల సగటు వయసు ఉన్న మరి కొందరి జన్యుపటాలనుకూడా సేకరించారు.

ఈ రెండిటినీ గమనించినప్పుడు COA1, STK17A అనే రెండు జన్యువులు ఇరువయసుల వారిలోనూ చురుగ్గా ఉన్నట్టు తేలింది.

వయసు మళ్లే కొద్దీ మనలోని జన్యువులుకూడా దెబ్బతింటాయి. వాటిని సరిచేసే వ్యవస్థసైతం దెబ్బ తినడం వల్ల ఆ నష్టం శాశ్వతంగా ఉండిపోతుంది.

కానీ, పైన పేర్కొన్న ఈ రెండు జన్యువులూ ఎప్పటికప్పుడు దెబ్బతిన్న జన్యువులు మరింతగా నష్టపోకుండా కాపాడుతున్నట్లు గుర్తించారు.

వయసు మళ్లిన తర్వాతకూడా ఇవి క్రియాశీలంగా ఉంటే వృద్ధాప్యపు ఛాయలు తగ్గుతాయి. ఎవరికి తెలుసు? రానున్న కాలంలో వీటిని సరిచేసే అవకాశం కూడా వస్తుందేమో..

Recent

- Advertisment -spot_img