రేవంత్ సర్కార్ తాజాగా వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం ఉద్యాన పంటలు (మామిడి, నిమ్మ, బత్తాయి) వంటి దీర్ఘకాలిక పంటలకు రుణమాఫీ రాదు. స్వల్పకాలిక పంట రుణాలకు మాత్రమే వర్తిస్తుందని, దీర్ఘకాలిక పంట రుణాలకు రుణమాఫీ వర్తించదని ప్రభుత్వం పేర్కొంది. వరి, చెరుకు, పత్తి, కూరగాయలు వంటి సీజనల్ పంటలకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుంది. ప్రైవేట్ బ్యాంకుల్లో తీసుకున్న పంటరుణాలకు ఈ పథకం వర్తించదు.