Homeహైదరాబాద్latest Newsలిడ్ క్యాప్ ఆక్రమణలపై రెవెన్యూ కొరడా.. పోలీస్ బందోబస్తు నడుమ నేలమట్టం

లిడ్ క్యాప్ ఆక్రమణలపై రెవెన్యూ కొరడా.. పోలీస్ బందోబస్తు నడుమ నేలమట్టం

ఇదేనిజం, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోగల లిడ్ క్యాప్ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారురు. రాయదుర్గం సర్వేనంబర్ 2, 3, 4, 5లోని ప్రభుత్వ స్థలాల్లో లిడ్ క్యాప్ భూముల్లో గతంలో గుడిసెలు, షెడ్లు వేసుకొని నివసిస్తున్నారు. అయితే వాటిని సోమవారం ఉదయమే రెవెన్యూ అధికారులు భారీ పోలీసుల మధ్య ఆక్రమణలను నేలమట్టం చేశారు. అయితే అక్కడి స్థలాల్లో ఉన్నవారు మాత్రం గత 40 సంవత్సరాలుగా తాము ఇక్కడే నివసిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

Recent

- Advertisment -spot_img