Homeహైదరాబాద్latest News"ఇండియన్ 2" రైట్స్ సొంతం చేసుకున్న "ఆర్ఆర్ఆర్" డిస్ట్రిబ్యూటర్

“ఇండియన్ 2” రైట్స్ సొంతం చేసుకున్న “ఆర్ఆర్ఆర్” డిస్ట్రిబ్యూటర్

దర్శకుడు శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “ఇండియన్ 2”. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌లో విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మేకర్స్ ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. తాజాగా నార్త్ డిస్ట్రిబ్యూటర్ ఎవరో మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని హిందీలో ‘RRR’ డిస్ట్రిబ్యూట్ చేసిన పెన్ స్టూడియోస్ సంస్థ భారీగా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. హిందీలో ఈ సినిమా “హిందుస్తానీ 2”గా రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని జూలై 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.ఈ సినిమాలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ అలాగే సిద్ధార్థ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img