Idenijam, Sportsdesk : Hyderabadలోని Uppal Stadiumలో ఇవాళ సాయంత్రం హైదరాబాద్, చెన్నై మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో బ్లాక్ టికెట్ల దందా కొనసాగుతోంది. ధోనీ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు రంగంలోకి దిగారు. ఒక్కో టికెట్‌ను బ్లాక్‌లో పదిరెట్లకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. 10 నిముషాల్లో 45 వేల టికెట్లు ఎలా అమ్ముడవుతాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆరోపించారు. HCA టికెట్లన్నిటినీ బ్లాక్‌లో అమ్మి, సామాన్యులకు అందుబాటులో లేకుండా చేసారని మండిపడ్డారు. ఈ విషయంపై చేతులెత్తేసిన హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్. టికెట్ల విషయంతో మాకు సంబంధం లేదంటున్న పోలీసులు. ఈరోజు సాయంత్రం సీఎం రెవంత్‌రెడ్డి ప్యామిలీతో సహా మ్యాచ్‌కు హాజరవనున్నారు.