తెలంగాణ రైతులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు రెండు, మూడు నెలల్లో 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షలు మాఫీ చేశామని చెప్పారు. దీపావళి తర్వాత నుంచి మరో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ రుణమాఫీ వర్తిస్తుందని, నవంబర్ రెండో వారంలోగా ప్రక్రియ పూర్తవుతుందని వ్యాఖ్యానించారు.