Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇందుకోసం రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే చేసి 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దీని ప్రకారం వ్యవసాయం చేసే భూములకే డబ్బులు అందనున్నాయి. ఈ స్కీం కింద ఏడాదికి ఎకరానికి రూ.12వేలు పంపిణీ చేయనుంది.