మెట్రోరైలు రెండోదశకు నిధుల లభ్యత పెద్ద సమస్య కాదని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైలు సంస్థ(HAML) అభిప్రాయపడుతోంది. ప్రాజెక్ట్‌కు కేంద్రం అనుమతి ఇస్తే అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థలు నిధుల మంజూరుకు సుముఖంగా ఉన్నాయని మెట్రోవర్గాలు అంటున్నాయి. 2 కంటే తక్కువ శాతానికే రుణం మంజూరు చేయడంతో పాటు పదేళ్ల మారటోరియం, 30ఏళ్లపాటు చెల్లింపులకు అవకాశం ఉంటుందని HAML ఎండీ NVS రెడ్డి తెలిపారు.