గుజరాత్లో విషాదం చోటుచేసుకుంది. శనివారం మెహ్సానా జిల్లాలోని కడి పట్టణ సమీపంలోని నిర్మాణ స్థలంలో మట్టి గోడ కూలిపోవడంతో ఐదుగురు కూలీలు మృతి చెందారు. జిల్లా కేంద్రానికి 37 కిలోమీటర్ల దూరంలోని జసల్‌పూర్ గ్రామంలో కార్మికులు భూగర్భ ట్యాంకు కోసం గొయ్యి తవ్వుతుండగా ఈ ప్రమాదం జరిగింది.ప్రమాద స్థలంలో ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ప్రహ్లాద్‌సింగ్ వాఘేలా తెలిపిన వివరాల ప్రకారం. ప్రస్తుతం ఐదు మృతదేహాలను వెలికితీశారు. ముగ్గురికి పైగా కూలీలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల నుంచి కూలీలను సురక్షితంగా బయటకు తీసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు అని తెలిపారు.