Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. బాలుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న బర్రె..!

షాకింగ్ ఘటన.. బాలుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న బర్రె..!

ఇదేనిజం, కంగ్టి: అచ్చట ముచ్చట తిరకుండానే బాలుడి నిండు ప్రాణాన్ని ఓ బర్రె బలితీసుకుంది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం…సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల నాగూర్( కె ) గ్రామనికి చెందిన మారుతి-పారమ్మ దంపతుల రెండో కుమారుడు రాజు ఎప్పటిలాగే తమ బర్రెను మేపడానికి ఆదివారం మధ్యాహ్నం పొలానికి తీసుకెళ్లాడు. ఎప్పటిలాగే సరదగా బర్రె పై కూర్చున్నాడు గేదెను మేపుతూ గేదెకూ ఉన్న తాడును నడుముకు కట్టుకున్నాడు. హఠత్తుగా గేదె పరుగులు పెట్టి రాజును చాలా దూరం ఈడ్చుకెళ్లింది దాంతో గాయాలైన రాజును కుటుంబ సభ్యులు బీదర్ ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గ మధ్యలోనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు తెలిపారు. దాంతో నాగూర్ కె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Recent

- Advertisment -spot_img