Homeహైదరాబాద్latest Newsషాకింగ్ ఘటన.. దొంగలతో కలిసిన కానిస్టేబుళ్లు, హోంగార్డు.. ఏం చేశారంటే..?

షాకింగ్ ఘటన.. దొంగలతో కలిసిన కానిస్టేబుళ్లు, హోంగార్డు.. ఏం చేశారంటే..?

హైదరాబాద్ లో ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో నిందితులను లోతుగా విచారించగా..ఆ కేసులో వీరికి గాందీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహించే కె.అశోక్‌ (45), కానిస్టేబుల్‌ పి.సోమన్న (38), సైఫాబాద్‌ ఠాణా కానిస్టేబుల్‌ సాయిరామ్‌ (34)లు సహకరిస్తున్నట్లు ఆధారాలు లభించాయి. వివరాలలోకి వెళ్తే.. ఓ నిందితుల బృందంలోని సభ్యుడు షానవాజ్‌ను ఎస్‌.ఆర్‌.నగర్‌ పోలీసులు ఒక కేసు నిమిత్తం గతంలో అరెస్టు చేశారు. ఆ సమయంలో హోంగార్డు అశోక్‌ ఎస్‌.ఆర్‌.నగర్‌ క్రైమ్‌ విభాగంలో విధులు నిర్వర్తించేవాడు. అలా వారికి పరిచయం ఏర్పడింది. నిందితుడు షానవాజ్‌ను హోంగార్డు అశోక్‌ చోరీ కేసు నుంచి బయటపడేశాడు. నిందితుల బృందం ఎప్పుడు హైదరాబాద్‌కు వచ్చినా హోంగార్డు అశోక్‌కు గ్రూప్‌ సభ్యుల ఫొటోలు పెట్టి వీరు మనవారే.. ఎక్కడైనా దొరికితే పట్టుకోవద్దు అని ముందుగానే సమాచారం పంపేవాడు. గత జూన్‌ నెలలో సైఫాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిందితుల గ్రూప్‌లో ఒక సభ్యుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అప్పుడు షానవాజ్‌.. హోంగార్డు అశోక్‌కు ఫోన్‌ చేసి తనను విడిపించాలని కోరాడు. అశోక్‌ గాందీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో పని చేసే సోమన్న అనే కానిస్టేబుల్‌ సాయంతో సైఫాబాద్‌లో విధులు నిర్వహించే సాయిరామ్‌కు చెప్పి నిందితుడిని తప్పించారు. ఇందుకోసం ఈ గ్రూప్‌లోని సభ్యుడు హోంగార్డు భార్య అకౌంట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా రూ.19 వేలు ద్వారా పంపగా.. హోంగార్డు సోమన్నకు రూ.6 వేలు ఇచ్చాడు. సోమన్న సాయిరామ్‌కు రూ.3 వేలు ఆన్‌లైన్‌ ద్వారా ట్రాన్స్‌ఫర్‌ చేశాడు. ఆధారాలతో సహా దొరకడంతో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 15 సెల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్నామని బృందాన్ని నడిపించే ప్రధాన నిర్వాహకులు ఝార్ఖండ్‌కు చెందిన కంచన్‌ నోనియా (34), రాహుల్‌ కుమార్‌ యాదవ్‌ (30)తో పాటు షాను (25), రింకులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img