Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్సీ బై పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్

ఎమ్మెల్సీ బై పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్

ఇదేనిజం, చేర్యాల టౌన్: ఈ రోజు ఎమ్మెల్సీ బై ఎలక్షన్ సందర్భంగా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ చేర్యాల మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాలను, దూల్మిట్ట మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరలీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహిస్తున్న సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎసిపి సతీష్, చేర్యాల సిఐ శ్రీను, ఎస్బి ఇన్స్పెక్టర్ కిరణ్, ఎలక్షన్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, చేర్యాల ఎస్ఐ దామోదర్, మద్దూర్ ఎస్ఐ యూనస్ అహ్మద్ అలీ, మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img