Homeహైదరాబాద్SLG Hospital : పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు పాఠ‌శాల‌లు, భ‌ద్ర‌త రెండూ ముఖ్య‌మే

SLG Hospital : పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు పాఠ‌శాల‌లు, భ‌ద్ర‌త రెండూ ముఖ్య‌మే

SLG Hospital : పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు పాఠ‌శాల‌లు, భ‌ద్ర‌త రెండూ ముఖ్య‌మే

SLG Hospital – పిల్ల‌ల మేధోవికాసానికి చ‌దువు చాలా ముఖ్యం. కానీ అదే స‌మ‌యంలో ప్ర‌స్తుతం కొవిడ్ మ‌హ‌మ్మారి ఉన్న నేప‌థ్యంలో పిల్లల భ‌ద్ర‌త కూడా ముఖ్య‌మే.

భ‌విష్య‌త్తు త‌రాన్ని కాపాడుకోవ‌డం ప్రాధాన్యాంశ‌మే. అలాగే స‌రైన చ‌దువు చెప్పించి, వారి స‌మ‌గ్రాభివృద్ధినీ చూడాలి.

అందువ‌ల్ల పాఠ‌శాల యాజ‌మాన్యాలు, త‌ల్లిదండ్రులు క‌లిసి పిల్లల చ‌దువులు కొన‌సాగ‌డానికి సుర‌క్షిత వాతావ‌ర‌ణాన్ని నెల‌కొల్పాలి.

ప్ర‌త్య‌క్ష త‌ర‌గ‌తులు ఇప్ప‌టికే ప్రారంభ‌మ‌య్యాయి. దాంతో దేశంలోని చాలా విద్యాసంస్థ‌లు కొవిడ్-19 హాట్‌స్పాట్లుగా మారుతున్నాయి.

ఈ అంశంపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆసుప‌త్రుల్లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి(SLG Hospital) కొవిడ్-19 గురించిన అపోహ‌లు, వాస్త‌వాల‌పైన‌… పాఠ‌శాల‌లు, ఇళ్ల‌లో పాటించాల్సిన ర‌క్ష‌ణ చ‌ర్య‌ల‌పైన ఆదివారం ఒక వెబినార్ నిర్వ‌హించింది.

ఆసుప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ పీడియాట్రీషియ‌న్ డాక్ట‌ర్ ప్ర‌యాగ జ్యోత్స్న నిజాంపేట‌లోని విజ్ఞాన్ స్కూలు విద్యార్థులు, వాళ్ల త‌ల్లిదండ్రుల కోసం ఈ కార్య‌క్ర‌మం ఏర్పాటుచేశారు.

వెబినార్ నిర్వ‌హ‌ణ సంద‌ర్భంగా ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి క‌న్స‌ల్టెంట్ పీడియాట్రీషియ‌న్ డాక్ట‌ర్ ప్ర‌యాగ జ్యోత్స్న మాట్లాడుతూ, “భార‌త‌దేశంలోను, ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొవిడ్-19 భ‌ద్ర‌త ప్రోటోకాల్స్‌ను ఉల్లంఘిస్తున్నందు వ‌ల్ల త‌ర‌గ‌తి గ‌దుల్లో చాలామంది విద్యార్థుల‌కు వైర‌స్ వ్యాపిస్తున్న అనేక సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి.

భౌతిక దూరం పాటించ‌డం, అంద‌రూ మాస్కులు ధ‌రించ‌డం, త‌ర‌గ‌తి గ‌దిలో త‌క్కువ మంది విద్యార్థులే మాజ‌రు కావ‌డం లాంటి నివార‌ణ వ్యూహాలు వైర‌స్ వ్యాప్తి నిరోధానికి కీల‌కం. ప్ర‌తి పాఠ‌శాల‌, ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రులు, విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా భ‌ద్ర‌త ప్రోటోకాల్స్ ప్రాధాన్యం గురించి అవ‌గాహ‌న క‌లిగి ఉండాలి.

ఎందుకంటే మ‌నం ఇంకా పూర్తిగా ఈ మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌కు రాలేదు” అని వివ‌రించారు.

పిల్ల‌లు, కిశోరావ‌స్థ‌లో ఉన్న‌వారు కూడా ఈ వ్యాధిని ఇత‌రుల‌కు వ్యాప్తి చేయ‌గ‌ల‌రు.

ఈ మ‌హ‌మ్మారి వ‌చ్చిన తొలినాళ్ల‌లో కుటుంబంలో గానీ, ఇత‌ర క్ల‌స్ట‌ర్ల‌లో గానీ పిల్ల‌ల వ‌ల్ల ఎక్కువ‌గా ఈ వ్యాధి సోక‌లేదు.

ఎందుకంటే పాఠ‌శాల‌ల్లో చ‌దువు, ఇత‌ర కార్య‌క‌లాపాలు ఆగిపోయాయి, వ్య‌క్తిగ‌తంగా జ‌ర‌గ‌లేదు.

అయితే క్యాంపుల‌కు హాజ‌ర‌య్యేవారు, క్రీడ‌ల్లో పాల్గొనేవారు, పాఠ‌శాల‌లకు వెళ్లే పెద్ద‌ల నుంచి ఇత‌రుల‌కు వైర‌స్ సోకింది.

అందువ‌ల్ల ఇప్పుడు పాఠ‌శాల యాజమాన్యాలు, త‌ల్లిదండ్రులు కూడా అన్నిర‌కాల భ‌ద్ర‌త ప్రోటోకాల్స్‌ను పాఠ‌శాల‌ల్లోను, ఇళ్ల‌లోను త‌ప్ప‌క పాటించాలి.

స‌మాజ సంక్షేమం విష‌యంలో త‌మ నిబ‌ద్ధ‌త‌ను ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రుల ఛైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ దండు శివ‌రామ‌రాజు, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డీవీఎస్ సోమ‌రాజు మ‌రోసారి వివ‌రించారు.

వ్యాధి వ‌చ్చాక చికిత్స కంటే నిరోధం ముఖ్య‌మ‌న్న అంశంపై అవ‌గాహ‌న‌కు ఇలాంటి మ‌రిన్ని సెష‌న్లు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రుల గురించి:
ఎస్ఎల్‌జీ ఆసుప‌త్రి హైద‌రాబాద్‌లోని నిజాంపేట బాచుప‌ల్లిలో ఉంది.

ఇందులో వివిధ స్పెషాలిటీల‌లో 999 పేషెంట్ కేర్ బెడ్లు ఉన్నాయి. అవ‌స‌ర‌మైన అన్నిర‌కాల వైద్య స‌దుపాయాలు, స‌మ‌గ్ర వైద్య‌సంర‌క్ష‌ణ‌, వ్యాధినిరోధ‌క విభాగం కూడా ఉన్నాయి.

అన్ని వ‌య‌సుల వారికి స్క్రీనింగ్ ద్వారా ప్ర‌స్తుత జీవ‌న‌శైలి వ‌ల్ల రాబోయే ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను గుర్తిస్తారు.

అవి వ్య‌క్తిగ‌తంగాను, కుటుంబ ఆరోగ్య‌చ‌రిత్ర ద్వారా వ‌చ్చినా గుర్తిస్తారు.

Recent

- Advertisment -spot_img