Homeహైదరాబాద్latest Newsమనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే..?

మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే..?

సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ వెబ్‌సీరీస్‌లో సోనాక్షి సిన్హా, మనీషా కోయిరాలా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ సక్సెస్‌ఫుల్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో నటించిన సోనాక్షి సిన్హా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విషయాలను పంచుకున్నారు. ‘నాకు మనీషా కొయిరాల అంటే ఎంతో ఇష్టం. హీరామండి వెబ్ సిరీస్ చూశాక ఆమెకు క్షమాపణలు చెప్పాను. కొన్ని సన్నివేశాల్లో భాగంగా ఆమెతో దురుసుగా ప్రవర్తించాను. నేను వాటిని ఎలా చేయగలిగాను అనిపించింది. అందుకే సారీ చెప్పాను’ అని తెలిపారు.

Recent

- Advertisment -spot_img