Homeహైదరాబాద్latest Newsస్వంత గ్రామ విద్యార్థులకు టై, బెల్ట్, ఐడి కార్డులు అందజేసిన ఎస్సై

స్వంత గ్రామ విద్యార్థులకు టై, బెల్ట్, ఐడి కార్డులు అందజేసిన ఎస్సై

ఇదే నిజం ,ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి మండలం, తుమ్మెనాల వాస్తవ్యులు, ముప్కాల్ సబ్ ఇన్స్పెక్టర్ చిటన్నోజు భాస్కర్ చారి ఊరి విద్యార్థులపై ప్రేమాభిమానంతో విద్యార్థులకు టై, బెల్ట్, ఐడి కార్డులు అందజేశారు. వీటిని వారి తండ్రి చేతుల మీదుగా MPPS తుమ్మెనాల విద్యార్థులకు ఈ రోజు అందజేయడం జరిగింది. చిటన్నోజు భాస్కర్ చారి ఫోన్లో విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు చిన్ననాటి నుండే క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ, నైతిక విలువలతో కూడిన సత్ప్రవర్తన అలవర్చుకోవాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు కాశెట్టి శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయురాలు సముద్రాల శిరీష లు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img