Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో లక్షెట్టిపేట అమ్మాయికి స్టేట్ ర్యాంక్

తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో లక్షెట్టిపేట అమ్మాయికి స్టేట్ ర్యాంక్

ఇదేనిజం, లక్షెట్టిపేట: తెలంగాణ ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు బుధవారం ఉదయం 11 గంటలకు విడదలయ్యాయి. ఫలితాల్లో అ‍మ్మాయిలదే హవా కొనసాగగా.. స్టేట్‌ టాపర్‌గా కూడా విద్యార్థినియే రావడం విశేషం. ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌లో పట్టణానికి చెందిన తోట భాస్కర్, రాధల పెద్ద కుమార్తె వైష్ణవి స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. ఈ విద్యార్థిని ఇంటర్‌ మొదటి ఏడాదిలో 470 మార్కులకు గాను ఏకంగా 467 మార్కులు సాదించ్చింది. ఎంపీసీ గ్రూప్‌ తీసుకున్న వైష్ణవి పరీక్షల్లో 467 మార్కులు సాధించింది. ఇంగ్లీష్‌- 98, సంస్కృతం- 99, మ్యాథ్స్‌ 1ఏ- 75, మ్యాథ్స్‌ 1బీ- 75, ఫిజిక్స్‌- 60, కెమిస్ట్రీ- 60 మార్కులు సాధించింది. వైష్ణవిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img