టీ-20 ప్రపంచ కప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను చిత్తు చేసిన టీమ్ఇండియా మరో కీలక పోరులో బంగ్లాదేశ్‌ను ఢీకొట్టనుంది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైన బంగ్లాను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమ్ఇండియా సెమీస్‌కు చేరుకోవడం దాదాపు ఖాయమవుతుంది. భారత్ – బంగ్లాదేశ్ ఇప్పటి వరకు 13 టీ20ల్లో తలపడగా.. 12 మ్యాచుల్లో ఇండియా గెలిచింది.