టీ20 వరల్డ్ కప్-2024లో ఆతిథ్య జట్టు అమెరికా సూపర్-8కు అర్హత సాధించింది. గ్రూప్-ఏలో ఉన్న యూఎస్ఏ అయిదు పాయింట్లు, +0.127 నెట్‌రన్‌రేటుతో తదుపరి దశకు క్వాలిఫై అయ్యింది. బలమైన జట్టు పాకిస్థాన్‌ను వెనక్కి నెట్టి కప్ వేటలో ముందడుగు వేసింది. వర్షం కారణంగా ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దవడంతో యూఎస్ఏ నేరుగా సూపర్-8కు చేరుకుంది. అంతకుముందు ఐర్లాండ్(2009), నెదర్లాండ్స్(2014), అఫ్గానిస్థాన్(2016), నమీబియా(2021), స్కాట్లాండ్(2021), నెదర్లాండ్స్(2022) ఉన్నాయి. కాగా 2026లో ఇండియా, శ్రీలంకలో జరిగే టీ20 వరల్డ్ కప్‌కు కూడా యూఎస్ఏ అర్హత సాధించింది. 2026 టీ20 వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫలితంగా గ్రూప్ దశలోనే లంక నిష్క్రమించినా.. తదుపరి వరల్డ్ కప్ టోర్నీలో నేరుగా ఆతిథ్య దేశంగా అర్హత సాధించింది.