Homeబిజినెస్‌TATA Tea Chakra Gold : ఈ టీ రుచి ఎంతో ఘనమైనది..

TATA Tea Chakra Gold : ఈ టీ రుచి ఎంతో ఘనమైనది..

TATA Tea Chakra Gold : ఈ టీ రుచి ఎంతో ఘనమైనది..

TATA Tea Chakra Gold : తమ తాజా పునః స్ధాపన ప్రచారంలో భాగంగా,  దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద టీ బ్రాండ్‌,

టాటా టీ చక్ర గోల్డ్‌, భారతదేశం యొక్క మహోన్నమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని, ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని వేడుక చేసే హైపర్‌ లోకల్‌ ప్రచారాల పరంపరను కొనసాగిస్తూ  తమ నూతన చిత్రం విడుదల చేసింది.

ముల్లెన్‌ లింటాస్‌, బెంగళూరు రూపొందించిన ఈ ప్రచారాన్ని, కేవలం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా ప్రాంతాల స్ఫూర్తిని మాత్రమే  కాదు, ఇక్కడి ప్రజల ప్రత్యేకమైన లక్షణాలనూ ప్రతిబింబించే రీతిలో తీర్చిదిద్దారు.

టాటా టీ యొక్క హైపర్‌ లోకల్‌ వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్తూ,  ఏపీ మరియు తెలంగాణా ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేకమైన ఈ చిత్రం ద్వారా జీవితంలో ప్రతి అంశాన్నీ,

ప్రతి క్షణాన్నీ ‘ఘనం’గా ఆస్వాదించాలనే తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితం కన్నా మిన్న అయిన థృక్పథాన్ని వేడుక చేస్తుంది.

తమ ఆహారంలో మసాలాల వినియోగం మొదలు, వారి చిత్రాలలో నాటకీయత వరకూ, తెలుగు భాషలోని తియ్యందనం మొదలు సంపూర్ణంగా ప్రదర్శించే వారి ధోరణి వరకూ –

ప్రతి చోటా మహోన్నతమైన అనుభవాలను అనుభవించాలనే అంశం చుట్టూనే ఇది తిరుగుతుంటుంది.

Specialty of Kashi : కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు..!

Killer Robots : కిల్లర్‌ రోబోలు.. మరి పేద దేశాల సైనికుల పరిస్థితి..

చక్ర గోల్డ్‌ యొక్క నూతన ప్రచారాన్ని  ఈ కీలకమైన అంశాల ఆధారంగా  తీర్చిదిద్దడం మాత్రమే కాదు బ్రాండ్‌ యొక్క ప్రతిపాదనను సముచితంగా ప్రదర్శించారు.

ఈ ఆవిష్కరణ గురించి పునీత్‌ దాస్‌, అధ్యక్షుడు– ప్యాకేజ్డ్‌ బేవరేజస్‌ (ఇండియా అండ్‌ సౌత్‌ ఆసియా),టాటా కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ మాట్లాడుతూ

‘‘తెలుగు ప్రజలకు గర్వకారణమైన అంశాలను ప్యాకేజింగ్‌పై చిత్రించడం ద్వారా  చక్రగోల్డ్‌పై మా తాజా పునః స్థాపన వ్యూహాన్ని అనుసరిస్తూ, 

ఇప్పుడు ఏపీ మరియు తెలంగాణా ప్రజలను లక్ష్యంగా చేసుకుని  జీవితాన్ని ‘ ఘనం’గా వేడుక చేసే రీతిలో చిత్రాన్ని ఆవిష్కరించడం పట్ల సంతోషంగా ఉన్నాము. 

ఈ ప్రచారం ద్వారా ఈ ప్రాంతపు మరియు ఇక్కడి ప్రజల అసలైన స్ఫూర్తిని మా హైపర్‌ లోకల్‌ వ్యూహంతో 

వెలుగులోకి తీసుకురావడంతో పాటుగా స్థానిక సంస్కృతితో వినియోగదారులను అనుసంధానించడం లక్ష్యంగా చేసుకున్నాము.

ఏపీ మరియు తెలంగాణా రాష్ట్రాల ప్రజలు ఏ విధంగా అయితే జీవితాన్ని మహోన్నతంగా గడపాలనుకుంటారో అదే రీతిలో

వారి ప్రాధాన్యతా టీ సైతం పూర్తిగా అన్ని అంశాలనూ కలుపుకుని చక్ర గోల్డ్‌ వాగ్ధానం చేసినట్లుగా  స్ట్రాంగ్‌, పంచీ టేస్ట్‌ను కలిగి ఉంటుంది’’ అని అన్నారు.

ఏది చేసినా ‘ఘనం’గా చేయాలనే తెలుగు వారి అభిరుచికి అద్దం పడుతూ పలు ఉత్సాహా పూరిత సంఘటనల సమాహారంగా ఈ చిత్రం ఉంటుంది.

సాధారణ అంశాలే అయినప్పటికీ ఘనంగా వేడుక చేసే  ఈ అంశాలలో  ముఖ్యఅతిథిని గజమాలతో సత్కరించడం,

విద్య పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన కుమారుడుని ఓ వీఐపీ అతిథిలా స్వాగతించడం, కేవలం ఇంటిని మాత్రమే కాదు,

మొత్తం ప్రాంతాన్ని అందంగా అలంకరించి  భారీ స్ధాయిలో వివాహం చేయడం, స్థానిక సీరియళ్ల కోస మెగా ప్రొడక్షన్‌ సెట్స్‌… ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి.

ఈ చిత్రం ఒక ఆలోచన – ‘జీవితంలో ప్రతి ఒక్క అంశమూ ఘనంగా సాగాలనుకున్నప్పుడు , టీ మాత్రం ఎందుకు సాధారణంగా ఉండాలి ?’ –తో ముగుస్తుంది. 

తద్వారా టాటా టీ చక్ర గోల్డ్‌  మరియు తెలుగువారి ప్రాధాన్యతల నడుమ బలీయమైన సంబంధాన్ని ఇది ప్రతిధ్వనిస్తుంది.

ఈ ప్రచార ఆలోచన గురించి ముల్లెన్‌ లింటాస్‌, సీఓఓ  గరిమా ఖండేల్‌వాల్‌ మాట్లాడుతూ ‘‘

తెలుగు రాష్ట్రాలలో ప్రతి అంశాన్నీ జీవితాన్ని మించిన ధోరణితో వేడుక చేసుకుంటుంటారు.

Graphics in Movies : సినిమాలో గ్రాఫిక్స్ సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ మీదే ఎందుకు చిత్రీకరిస్తారు

Cricketer Harleen Kaur : అందం, ఆటతో అదరగొడుతున్న ఆల్​రౌండర్..

తమ జీవితంలో ప్రతి క్షణాన్నీ భావోద్వేగాలు, ప్రజలు మరియు జీవితంలో అన్నీ చక్కటి అంశాలతో నింపుకోవాలని తలుస్తుంటారు. 

అది భారీ చిత్రాలైనా లేదా తెలుగు రాష్ట్రాలలో కనిపించే అపూర్వమైన విందు అయినా ; అవి  స్ఫూర్తిదాయకంగా ఉండటం మాత్రమే కాదు, తమకు తామే సాటి అన్నట్లుగా ఉంటాయి.

ఈ అంశాలనే మేము ప్రదర్శించడం ద్వారా మా వాణిజ్య ప్రకటనలను తీర్చిదిద్దాలనుకున్నాము. 

ఈ భావనలను అద్భుతంగా ఒడిసిపట్టే వ్యావహారిక పదం‘ఘనం’ఉపయోగించడం ద్వారా ఆ దృక్పథం చాటాము.

ఆ తరువాత మేము పట్టణాలకు వెళ్లడంతో పాటుగా విభిన్నమైన జీవిత అంశాలను మరియు సందర్భాలను ఒడిసిపట్టాము. 

అది  ఆ సంఘటనల వాస్తవికత, వ్యాప్తిని మాత్రమే కాదు ప్రతి ఒక్కటీ  ‘ఘనం’ అనే స్ఫూర్తినీ వెలుగులోకి తీసుకువస్తుంది.

సరిగ్గా చెప్పాలంటే, చక్ర గోల్డ్‌ యొక్క మహోన్నత రుచి, దానిని ఘనమైన టీగా మలిచినట్లు !’’ అని అన్నారు

ఈ చిత్రానికి  దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ దర్శకుడు వీ కె ప్రకాష్‌ దర్శకత్వం వహించారు.

తెలుగు టీవీ పరిశ్రమకు చెందిన నటులు దీనిలో నటించారు. ఈ ప్రచారానికి గొంతును సుప్రసిద్ధ తెలుగు నటుడు రావు రమేష్‌ అందించారు.

Recent

- Advertisment -spot_img