HomeరాజకీయాలుTelangana Elections : చెన్నూరులో ఉద్రిక్తత

Telangana Elections : చెన్నూరులో ఉద్రిక్తత

– ఒకేసారి నామినేషన్ వేసేందుకు వచ్చిన బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు బాల్క సుమన్, వివేక్ వెంకటస్వామి
– ఎన్నికల కోడ్ పేరుతో వివేక్ కారును అడ్డుకున్న పోలీసులు
– సుమన్​ వాహనాన్ని యధావిధిగా పంపించడంతో గొడవ
– నినాదాలతో హోరెత్తించిన ఇరు పార్టీల కార్యకర్తలు

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: చెన్నూరు ఆర్వో సెంటర్(రిటర్నింగ్ ఆఫీస్) వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గురువారం ఉదయం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయటానికి వెళ్లిన వివేక్ వెంకటస్వామిని వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు . కార్లకు అనుమతి లేదని.. కేవలం ఐదుగురికి మాత్రమే అనుమతి ఉందని చెబుతూ.. రిటర్నింగ్ అధికారి ఆఫీసుకు 500 మీటర్ల దూరంలో ఆయన వాహనాన్ని పోలీసులు ఆపేశారు. 144 సెక్షన్ ఉందని.. ఎన్నికల రూల్స్ అని చెప్పారు. వివేక్ నడుచుకుంటూనే వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వెహికల్​ను, అనుచరులను రిటర్నింగ్ అధికారి ఆఫీసు వరకు పోలీసులు అనుమతిచండంతో వారి తీరుపై వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ప్రశ్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలపై బీఆర్ఎస్ కార్యకర్తలు దౌర్జన్యం చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్​పై ఎలక్షన్ కమిషన్ కు కంప్లయింట్ చేశారు వివేక్ వెంకటస్వామి. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.


పరకాలలో..


గురువారం మంచి రోజు కావడంతో పెద్ద ఎత్తున పలు పార్టీల నేతలు నామినేషన్లు వేస్తున్నారు. పరకాలలోని రిటర్నింగ్ ఆఫీస్(ఆర్వో) సెంటర్​లో నామినేషన్ వేసేందుకు ఒకే టైమ్​లో కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేరుకున్నారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురు పడటంతో పరస్పర నినాదాలతో హోరెత్తించారు. ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను పోలీసులు చెదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో పరకాలలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Recent

- Advertisment -spot_img