Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ఐసెట్-2024 దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణ ఐసెట్-2024 దరఖాస్తు గడువు పొడిగింపు

ఇదేనిజం, ఎడ్యుకేషన్: తెలంగాణలో ఐసెట్-2024 దరఖాస్తు గడువు పొడిగించారు. ఐసెట్-2024 షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల షెడ్యూల్ నిన్నటితో తుది గడువు ముగిసింది. కానీ అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు ఎలాంటి ఆలస్యం రుసుం లేకుండా మే 7వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్ లో స్వీకరించనున్నట్లు ఐసెట్ కన్వీనర్ తెలిపారు. రూ. 250 అపరాధ రుసుముతో మే 17 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో మే 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సమర్పించిన వివరాల్లో ఏమైనా మార్పులుంటే సవరణకు ఈ నెల 17 నుంచి 20 వరకు అవకాశం కల్పించారు. అయితే తెలంగాణలో జూన్ 5, 6వ తేదీల్లో ఐసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 28న హాల్ టిక్కెట్లను విడుదల చేయనున్నారు.

Recent

- Advertisment -spot_img