Homeవిద్య & ఉద్యోగంతెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2009 ‌‌- 2

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2009 ‌‌- 2

09-10-2009

ఫ్రిజోన్‌ వివాదంపై సుఫ్రీం కోర్టు తీర్పు.

హైదరాబాద్‌ 6వ జోన్‌లో భాగమైనప్పటికి రాష్ట్రపతి ఉత్తర్వు లోని 14ఎఫ్‌ నిబంధన అనుసరించి పోలీస్‌ అధికారుల నియామకాల విషయంలో మాత్రం ఫ్రిజోన్‌గా పరిగణించాలని తీర్పునిచ్చింది.

11-10-2009

ఫ్రీజోన్‌ పై సుఫ్రిం కోర్టు తీర్పుకు నిరసనగా తెలంగాణ ఎస్టీఓల సంఘం ఆధ్వర్యంలో టిఎన్‌బజివో భవన్‌ నుంచి ఛలో అసెంబ్లీ కార్యక్రమం, పోలీసులు అడ్డగించడంతో గన్‌ వార్మువద్ద ధర్నా.

21-11-2009

సిద్ధి పటలో తెలంగాణ ఉద్యోగుల గర్జన, భారీ బహిరంగ సభ, కెసిఆర్‌ ఆమరణదీక్ష ప్రకటన.

28-11-2009

నిరహారదిక్షలో పాల్గొనెందుకు హైదరాబాద్‌ నుండి కరీంనగర్‌ బయలుదేరివెళ్లిన కె.సి.ఆర్‌.

కరీంనగర్‌లోని టిఆర్‌ఎస్‌ ఆఫీసు (తెలంగాణ భవన్‌ొ ను చుట్టుముట్టెందుకు భారీగా పోలీసుల మోహరింపు, ప్రతిఘటించిన తెలంగాణఉద్యమకారులు. రాత్రంతా హైడ్రామా..

28-11-2009

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్దమై కరీంనగర్‌ నుంచి బయలుదేరిన కేసీఆర్‌ ను పోలీసులు అల్జునూరువద్ద అరెస్టు చెసి ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.

తెలంగాణలో ఈ సంఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్‌. బి. నగర్‌వద్ద శ్రీకాంతాచారి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యా యత్నం. ఆసుపత్రికి తరలింపు.

30-11-2009

ఖమ్మం జిల్లా జైల్‌నుంచి కెసిఆర్‌ను జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించిన పోలిసులు

01-12-2009

నిజామాబాద్‌ జిల్లాలో కానిస్టైబుల్‌ కిష్టయ్య సెల్‌ టవర్‌పైకి ఎక్కి రివాల్వర్‌తో కాల్చుకుని మృతి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరునిగా చరిత్రలో నిలిచిపోయిన కాని స్టైబుల్‌

03-12-2009

ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శ్రీకాంతాచారి మృతి. ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి నుండి కెసిఆర్‌ను భారి బందోబస్తు మధ్య హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించిన పోలీసులు.

05-12-2009

అసెంన్లీలో తెలంగాణపై చర్చ. కెసిఆర్‌ దీక్షను విరమింపజేయాలనివినతి.

7-12-2009

ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావెశం, తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తామన్న అన్ని రాజకీయ పార్టిలు.

9-12-2009

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామన్న కేంద్ర హోంమంత్రి చిదంబరం, అర్ధరాత్రి నిరాహార దిక్ష విరమించిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.

10-12-2009

చిదంబరం ప్రకటనను వ్యతిరేకించిన సీమాంధ్ర నేతలు, మూకుమ్మడి రాజీనామాలు.

23-12-2009

చిదంబరం మరో ప్రకటన. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు భిన్న వైఖరులు తీసుకున్న కారణంగా విసృత సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని ప్రకటన

24-12-2009

చిదంబరం ప్రకటనపై తెలంగాణలో ఆగ్రహావేశాలు, తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటి (జేఏసి) ఎర్పాటు.

25-12-2009

బంజారాహిల్స్‌ లోని రావి నారాయణరెడ్డి హాల్‌లో జేయేస్‌ స్టిరింగ్‌ కమిటి తొలి సమావేశం. జేయేసీ కన్వీనర్‌గా ప్రాఫెసర్‌ యం.కోదండరామ్‌ ఏకగీవంగా నియామకం.

30-12-2009

చిదంబరం మూడో ప్రకటన. జనవరి 5న ఢిల్లీకి రావాలని ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది రాజకీయ పార్టీలకు పిలుపు.

మరిన్ని..

తెలంగాణ ఉద్యమం మరోసారి నెమరేద్దాం.. పార్ట్​ 1

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2010 ‌‌- 3

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2011 ‌‌- 4

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2012 ‌‌- 5

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2013 ‌‌- 6

తెలంగాణ చివరి దశ ఉద్యమంలో ప్రధాన ఘట్టాలు 2014 ‌‌- 7

Recent

- Advertisment -spot_img