నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రిలో మొలచింతలపల్లి పాశవిక ఘటనలో గాయపడిన ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను పరామర్శించి, భరోసా నిచ్చిన మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి.పార్టీ తరుపున 1 లక్ష 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి.ఆమెకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు..మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు రాక్షస పాలన నడుస్తుంది. ఆడబిడ్డపై మాటల్లో చెప్పారని ఘోరమైన పాశవిక దాడి జరిగి 7 రోజులైనా ఇప్పటికి నిందుతులపై ఎలాంటి చర్యలు తీసుకోని ప్రభుత్వాన్ని చుస్తే సిగ్గు అనిపిస్తుంది. నిందుతులపై ఈరోజు వరకు చర్యలు తీసుకుపోవడం చాల బాధాకరం. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు మల్లి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు