నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను నేల మట్టం చేసింది. ఇప్పుడు హైడ్రా చూపు కేటీఆర్ ఉంటున్న జన్వాడ ఫాం హౌస్పై పడింది. జీవో నెంబర్ 111కు విరుద్ధంగా నిర్మించిన జన్వాడ ఫాం హౌస్ను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.